యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ శనివారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసింది. భద్రతా కారణాల దృష్ట్యా మొబైల్, ఇంటర్నెట్ సదుపాయాలు నిలిపివేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని జమ్మూ డీఐజీ తెలిపారు. అధికారులు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు జమ్మూ డిప్యూటీ కమిషనర్ రమేశ్ కుమార్ వివరించారు. కర్ఫ్యూను కొనసాగించాలా వద్దా అనే విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
పుల్వామా ఉగ్ర దాడిని ఖండిస్తూ పాకిస్థాన్ వ్యతిరేకంగా శుక్రవారం జమ్మూలో నిరసనలు వెల్లువెత్తాయి. పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి. ఒక పోలీసు అధికారి సహా తొమ్మిది మంది గాయపడ్డారు.