పుల్వామా ఘటన అనంతరం భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో పాక్లో పర్యటించిన అనంతరం దిల్లీని సందర్శించనున్నారు సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ . ఇండియాలో భారీ పెట్టుబడులకు సౌదీ సుముఖంగా ఉందని సమాచారం.
ఈ పర్యటనలో ఇరు దేశాలు ఐదు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నాయి. వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఏర్పాటుపై చర్చిస్తారు. ఇరుదేశాల మధ్య భద్రతా సహకారం మరింత బలోపేతమయ్యేలా ఉమ్మడి నావికా శిక్షణ నిర్వహణపై నిర్ణయం ప్రకటించనున్నారు.
భద్రతకు సంబంధించి ఇరుదేశాల మధ్య పరస్పర సహకారం కొనసాగుతోంది. ఉగ్రవాద నిర్మూలన, నిఘా సహకారం, మనీ లాండరింగ్-తీవ్రవాదానికి సంబంధించిన సమాచారాన్ని పంచుకోవడంలో ఇరు దేశాలు చురుగ్గా ఉన్నాయి.
రత్నగిరి రిఫైనరీ ప్రాజెక్టులో 44కోట్ల బిలియన్ డాలర్లను వెచ్చించేందుకు సౌదీ అరామ్కో, అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ(ఏడీఎన్ఓసీ)లు సుముఖంగా ఉన్నాయి.
పుల్వామా ఘటనను సౌదీ అరేబియా ఖండించింది. ఉగ్రవాదం, జమ్మూకశ్మీర్ విషయాల అవగాహనపై గత కొన్నేళ్లలో పరివర్తన సాధించింది సౌదీ. పుల్వామా దాడికి సంబంధించి పాకిస్థాన్ కథనాలను నమ్మలేమని సౌదీ అధికారులు తెలిపారు.