కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సీపీఎం నేత సీతారాం ఏచూరిలకు ముంబయి మెజిస్ట్రేట్ కోర్టు సమన్లు జారీ చేసింది. పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యను భాజపా- ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు ముడిపెడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆర్ఎస్ఎస్ కార్యకర్త జోషి వారిపై పరువునష్టం దావా దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు ఇద్దరు నేతలకు సమన్లు జారీ చేసింది.
వ్యక్తిగతంగా హాజరు కండి
విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని రాహుల్ గాంధీ, సీతారాం ఏచూరిలను ఆదేశించింది ముంబయి కోర్టు. తదుపరి విచారణను మార్చి 25కు వాయిదా వేసింది.
కాంగ్రెస్ పార్టీ అప్పటి అధ్యక్షురాలు సోనియా గాంధీ, సీపీఎం పార్టీపైనా ఆర్ఎస్ఎస్ కార్యకర్త జోషి ఫిర్యాదు చేశారు. వాటిని న్యాయస్థానం తోసిపుచ్చింది. వ్యక్తిగత వ్యాఖ్యలకు పార్టీని తప్పుపట్టడం సరికాదని వ్యాఖ్యానించింది.
2017లో పాత్రికేయురాలు గౌరీ లంకేష్‌ను ఆమె నివాసం బయటే హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. అనంతరం ఆర్ఎస్ఎస్పై రాహుల్, ఏచూరీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నది జోషి ఆరోపణ.