నిందితుల్లో ఒకరైన అశ్విని దాఖలు చేసిన దరఖాస్తు ఆధారంగా కోర్టు ఈ ఆదేశాలు వెలువరించింది. కేసులో నిజానిజాలను సీబీఐ దాచి పెడుతోందని, ముజఫర్పూర్ మాజీ కలెక్టర్ ధర్మేంద్ర సింగ్, మాజీ డివిజినల్ కమిషనర్, ప్రస్తుత సాంఘిక సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి అతుల్ కుమార్ సింగ్, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పాత్రపై విచారణ సరైన రీతిలో జరగలేదని అశ్విని దరఖాస్తులో ఆరోపించారు.
ఎవరీ అశ్విని:
అశ్విని వృత్తి రీత్యా వైద్యుడు. ముజఫర్పూర్ వసతిగృహంలో బాలికలను లైంగికంగా వేధించే ముందు వారికి మత్తు ఇంజెక్షన్లు చేసేవాడు.
వాదనలు ఎప్పటి నుంచి:
ఫిబ్రవరి 7న ఈ కేసు దిల్లీలోని పోక్సో కోర్టుకు బదిలీ అయింది. వచ్చే వారం నుంచి ఈ కేసులో వాదనలు ప్రారంభం కానున్నాయని సీబీఐ అధికారులు తెలిపారు.