కశ్మీరీలపై దాడులు అరికట్టాలని కేంద్రం సహా 11 రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించడంపై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనిని అత్యున్నత న్యాయస్థానం చేసిందని వ్యాఖ్యానించారు.
పుల్వామా ఉగ్రదాడి తర్వాత కశ్మీరీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని సుప్రీం కోర్టు 11 రాష్ట్రాలను ఆజ్ఞాపించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తర్ప్రదేశ్, బిహార్, జమ్ముకశ్మీర్, హరియాణా, మేఘాలయా, పశ్చిమ్ బంగ, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, దిల్లీ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
కేంద్రంపై ధ్వజం
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించిన కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దేశంలో కశ్మీరీలపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చూసీచూడనట్టు వ్యవహరిస్తోందని ఆరోపించారు.
" class="align-text-top noRightClick twitterSection" data=""సుప్రీం ఆదేశాలతో కశ్మీరీ విద్యార్థులకు వేధింపులు, బహిష్కరణ నుంచి భరోసా లభిస్తుంది. చర్యలు చేపట్టాల్సిన వారు గుడ్డివారిగా మారితే సుప్రీం కోర్టు వారి పనిని చేసింది"
- మెహబూబా ముఫ్తి, పీడీపీ అధ్యక్షురాలు
Relieved about the SC order to ensure Kashmiri students based outside J&K are not harassed or face social boycott . Shameful that the honourable judiciary took decisive action where others conveniently turned a blind eye.
— Mehbooba Mufti (@MehboobaMufti) February 22, 2019
">Relieved about the SC order to ensure Kashmiri students based outside J&K are not harassed or face social boycott . Shameful that the honourable judiciary took decisive action where others conveniently turned a blind eye.