కర్ణాటకలో జయరాం అనే వ్యక్తి వినూత్నంగా పెళ్లి చేసుకున్నాడు. మంత్రాలకు బదులుగా ప్రధాని నరేంద్రమోదీ మనసులో మాట కార్యక్రమం వింటూ వధువు దమయంతి మెడలో తాళి కట్టాడు.
మంగళూరుకు చెందిన జయరాం భాజపా కార్యకర్త. మోదీకి వీరాభిమాని. తన పెళ్లిలో మోదీకి సంబంధించింది ఏదైనా ఉండాలని భావించాడు జయరాం. దానికోసం మోదీ 53వ మనసులో మాట కార్యక్రమం వచ్చే సమయాన్ని ముహూర్తంగా ఎంచుకున్నాడు. శూల్య పట్టణంలోని మహావిష్ణు మందిరంలో రేడియోతో పాటు స్పీకర్లను ఏర్పాటు చేసుకున్నాడు జయరాం.
ఇదీ చూడండి: వారికి కుటుంబం-నాకు దేశం