ఇరు దేశాల సైన్యం మధ్య క్రీడలు నిర్వహిద్దామని భారత్కు ఆహ్వానం పంపారు చైనా సైన్యాధికారి. ఈ క్రీడలు చైనా భూభాగంలోనే నిర్వహించాలని తెలిపారు. ఈ ఆటలతో రెండు దేశాల కమాండర్లకు అవగాహన కుదిరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. చైనా ప్రతిపాదనకు అంగీకరించినట్లు తూర్పు కమాండ్ ముఖ్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ ఎమ్ ఎమ్ నరావనే వెల్లడించారు.
సిక్కింలోని డోక్లాం ప్రాంతాన్ని తమదని చైనా పేర్కొన్న కారణంగా 2017లో 73 రోజుల పాటు రెండు దేశాల మధ్య సఖ్యత లోపించింది. సరిహద్దు వెంట ఉద్రిక్తతలు తలెత్తకుండా, అవగాహన పెంచేందుకు ఈ క్రీడలు ఉపకరించనున్నట్లు పేర్కొన్నారు నరావనే.