తమిళనాడు పోరూరులో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పార్కింగ్ ప్రదేశంలో మధ్యాహ్నం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా వ్యాపించాయి. ఈ ఘటనలో 200 కార్లు దగ్ధమయ్యాయి.
కొందరు స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అధికారులు 5 అగ్నిమాపక శకటాల్ని, 30మంది సిబ్బందిని రంగంలోకి దింపారు.
అగ్నిమాపక శాఖకు తోడు కొంత మంది ప్రైవేటు నీటి ట్యాంకర్ల యజమానులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
అగ్నిప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ అలుముకుంది. స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పోలీసులు ముందుజాగ్రత్తగా చుట్టపక్కల ప్రాంతాలను ఖాళీ చేయించారు.
ఇదీ చూడండి:కార్ల దహనానికి కారణమిదే
బెంగళూరు ఏరో ఇండియా ప్రదర్శన వద్ద శనివారం ఇలాంటి ప్రమాదమే జరిగింది. 300కార్లు దగ్ధమయ్యాయి.