బిహార్ రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి బిహార్ శివన్ జిల్లా నిజామ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సరాయి పోలీసు స్టేషన్ సమీపంలో వ్యానును ఓ అదుపుతప్పిన ట్రక్కు ఢీకొంది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 10 మంది తీవ్రగాయాలపాలయ్యారు. క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రులకు తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న బాధితుల బంధువులు ఆందోళన చేపట్టారు.