తీవ్రవాద నిర్మూలనకు సాధ్యమైనన్ని చర్యలు తీసుకోవాలని హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధికారులను ఆదేశించారు.
పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంతో పాటు దేశంలో భద్రతా పరిస్థితిపై అధికారులు హాంమంత్రికి వివరించారు. జమ్ముకశ్మీర్‌తోపాటు దేశంలో శాంతికి భంగం కలిగించేందుకు పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థలు కుట్రలు అమలుచేయకుండా భద్రతా చర్యలు తీసుకోవటంపై ఈ సమావేశంలో చర్చించారు.
వారు జాగ్రత్త....
తమ ప్రాంతంలో నివసిస్తున్న జమ్ముకశ్మీర్ విద్యార్థులు, ప్రజల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ అన్ని రాష్ట్రాలకు సలహా ఉత్తర్వులను జారీచేసింది.
పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు ఉగ్రదాడిలో మరణించిన అనంతరం జమ్ముకశ్మీర్ వాసులకు బెదిరింపులు వచ్చినట్లు హోం శాఖ అధికారులు తెలిపారు.
ఆస్తులపై దాడులు జరుగుతాయన్న భయంతో తమ యజమానులు ఇంటిని ఖాళీ చేయాలని చెబుతున్నట్లు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో నివసిస్తున్న కొందరు కశ్మీరీ యువకులు ఆరోపించారు.