ETV Bharat / bharat-news

హిందుత్వమే అంతః సూత్రం..! - maharashtra

శివసేన వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ఎన్డీయేలోనే భాగస్వామిగా ఉండనుంది. అమిత్​ షాతో చర్చల అనంతరం ఉద్ధవ్​ ఠాక్రే పొత్తులపై స్పష్టతనిచ్చారు.

వాళ్ల కాపురం చెడిపోలేదు.!
author img

By

Published : Feb 18, 2019, 10:10 PM IST

Updated : Feb 19, 2019, 6:35 AM IST

'భాజపా-శివసేన' ఈ రెండు పేర్లు వినగానే ఇవి మిత్రపక్షాలా లేక విరోధులా? అన్న సందేహం కలుగుతుంది. ఒకరిపై మరొకరు తీవ్రంగా విమర్శించుకుంటారు. వారే తిరిగి చేతులు కలుపుతారు. ఎన్నికల్లో కలిసి పోటీచేస్తారు. ఇరు పార్టీల చరిత్రలో ఇలా జరిగిన సందర్భాలెన్నో..! 2014 ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసిన 'భాజపా-శివసేన కూటమి' మొత్తం 288 శాసనసభ స్థానాల్లో 185(భాజపా 122, శివసేన 63) సీట్లలో విజయం సాధించింది. గత కొంత కాలంగా విభేదాలు పొడసూపినా.. తాజాగా అమిత్​షా, ఉద్ధవ్​ థాకరే చర్చలతో 2019 ఎన్నికల్లోనూ పొత్తులకు మార్గం సుగమమైంది.

ముఖ్యమంత్రి పీఠంపై సేన కన్ను.!

ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన సేన 2019లో మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగుతామని భాజపాను చాలాకాలంగా హెచ్చరించింది. అయితే భాజపా అధినేత అమిత్​ షాతో చర్చల అనంతరం ఇరుపార్టీలు కలిసి పోటీ చేసేందుకే నిర్ణయించారు. చెరో సగం అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది. లోక్​ సభ సీట్లలో మాత్రం 45 స్థానాలకు భాజపా 25, శివసేన 23 చోట్ల పోటీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

2014 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో భాజపాకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన శివసేన... అనంతరం విబేధాలు పొడసూపి విమర్శలు గుప్పించింది. రైతులు, మరాఠాల రిజర్వేషన్లు తదితర సమస్యలను పరిష్కరించడంలో ఫడనవీస్​ ప్రభుత్వాన్ని నిందించిన శివసేన... ఒకదశలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేసేందుకు సమాయత్తమైంది. అయితే భాజపాతో చర్చల అనంతరం 2019 ఎన్నికలకు కలిసివెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసింది.

undefined

పొత్తులు కొలిక్కి!

ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ అయోధ్య రామమందిరం, నోట్ల రద్దు తదితర అంశాల్లో శివసేన కేంద్రాన్ని వేలెత్తి చూపింది. ఈ నేపథ్యంలో 2019 లోక్​సభ ఎన్నికల్లో శివసేన మోదీకి మద్దతుగా నిలుస్తుందా? లేదా? అన్న సందేహం అందరిలోనూ కలిగింది. శివసేన ఎంపీ ఆనంద్‌ రావ్‌ అడ్సుల్ ఆ అనుమానాలకు చెక్​ పెట్టారు. ఇటీవల లోక్​సభలో ప్రసంగిస్తూ మరోసారి మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారాయన. సోమవారం 'అమిత్​ షా-ఉద్ధవ్ ఠాక్రే' మధ్య జరిగిన పరస్పర చర్చలతో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చి పొత్తుల కథ సుఖాంతమైంది.

శివసేన విభేదించిన అంశాలివే..

అయోధ్య రామ మందిర నిర్మాణం దగ్గర నుంచి మొన్నటి చంద్రబాబు ధర్మపోరాట దీక్ష వరకూ చాలా సందర్భాల్లో కేంద్రమే లక్ష్యంగా శివసేన విమర్శనాస్త్రాలు సంధించింది.

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని శివసేన విమర్శించింది. తమ పార్టీ పత్రిక 'సామ్నా'లో కేంద్రాన్ని విమర్శిస్తూ ఓ కథనాన్ని ప్రచురించింది.

భాజపాతో శివసేన విభేదించిన సందర్భాలు

  • అయోధ్య రామ మందిర నిర్మాణం (రామ మందిర నిర్మాణం చేపట్టే విధంగా కేంద్రం ఆర్డినెన్స్ తేవాలని డిమాండ్​ చేసింది. గుడి నిర్మాణం ఎప్పుడు చేపడతారో తెలపాలని పట్టు బట్టింది)
  • నోట్ల రద్దు (దేశ ఆర్థిక వ్యవస్థను కేంద్రం తూట్లు పొడిచిందని విమర్శ)
  • జీఎస్టీ (పలు వస్తువులపై అధికశాతం పన్ను వసూలు చేస్తున్నారని విమర్శ)
  • స్వచ్ఛ భారత్​ (ప్రచారానికి అనవసరంగా నిధులు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శ)
  • మేక్ ఇన్​ ఇండియా(కుంభకోణంగా అభివర్ణించిన శివసేన)
  • పుల్వామా ఉగ్రదాడి ఘటనపై కూడా శివసేన కేంద్రాన్ని విమర్శించింది. ప్రధాని దేశ రాజకీయ పార్టీలపై కాకుండా పాకిస్థాన్​పై లక్షిత దాడులు చేయాలని ఎద్దేవా చేసింది. (అయితే పుల్వామా దాడికి ధీటుగా జవాబిస్తామన్న కేంద్రానికి బాసటగా నిలిచింది. పాక్​ భూభాగాలైన లాహోర్​, ఇస్లామాబాద్​ ప్రాంతాల్లో కూడా లక్షిత దాడులు చేస్తేనే ఆ దేశానికి బుద్ధి వస్తుందని ప్రకటించింది.)
  • రైతు సమస్యలు (రైతులకు కనీస మద్ధతు ధర ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వంతో విభేదం)
  • మరాఠాల రిజర్వేషన్లు (రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మరాఠాలక ప్రత్యేక రిజర్వేషన్​కై పట్టు)
undefined

ఒక్కసారే శివసేన 'ముఖ్యమంత్రి'

1966లో పార్టీ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటివరకు 1995లో మాత్రమే శివసేన అభ్యర్థి మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 'భాజపా-శివసేన' కూటమి విజయంతో 'మనోహర్​ జోషీ' ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

Intro:Body:Conclusion:
Last Updated : Feb 19, 2019, 6:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.