పాకిస్థాన్ బాలాకోట్‌లో మంగళవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో భారీ శబ్దాలు విన్నారు స్థానికులు. భూకంపం వచ్చిందని ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశామని చెప్పారు. ఆకాశంలో యుద్ధ విమానాలు విహరించడం చూసి భయాందోళనలకు లోనయ్యామని వెల్లడించారు. ఏం జరుగుతోందో అంతుచిక్కని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. శబ్దాలకు కారణం జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన నిర్వహించిన మెరుపు దాడులని వారికి తర్వాత తెలిసింది. 1000కిలోల బాంబులతో ఉగ్ర శిబిరాలపై భారత వాయు దళం విరుచుకుపడింది. సమారు 350 మంది ఉగ్రవాదులను క్షణాల్లో మట్టుబెట్టింది.
"నేను ఇక్కడే నివసిస్తాను..తెల్లవారు జామున మూడు గంటల సమయంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. రాత్రి సమయం అయినందు వల్ల ఏం జరుుగుతుందో అర్థం కాలేదు. ఉదయం ఘటనా స్థలానికి వెళ్లాక ఏమో జరిగిందని అర్థమైంది."
-- మహమ్మద్ ఆదిల్, బాలాకోట్ వాసి