అసోం కల్తీ మద్యం ఘటన మరిన్ని కుటుంబాల్లో విషాదం మిగిల్చింది. మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 149 కి చేరింది. మరో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది.
గోలాఘాట్, జోర్హాట్ ప్రాంతాల్లో గురువారం రాత్రి టీ తోటల్లో మద్యం సేవించిన సుమారు 300 మంది అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బాధితులను సమీపంలోని ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. వీరిలో అనేక మంది చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.