ETV Bharat / bharat-news

దాడికి అదే కలిసొచ్చింది

బాలాకోట్​ వరకు భారత దళాలు రావనుకున్నారు జైషే మహ్మద్​ నేతలు. విలాసవంతమైన స్థావరంలో ఉగ్రవాదులకు బస ఏర్పాటుచేశారు. కానీ... భారత్​ వారి అంచనాల్ని తలకిందులు చేసింది. దాదాపు 350మందిని హతమార్చింది.

దాడి చేసిన ప్రాంతాలు
author img

By

Published : Feb 26, 2019, 4:38 PM IST

పుల్వామా దాడి తర్వాత భారత్​ తీవ్రంగా ప్రతిస్పందిస్తుందన్నది అందరూ ఊహించిందే. అందుకు తగినట్లే ఉగ్రవాదులూ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. నియంత్రణ రేఖకు సమీపంలో... పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో ఉన్న శిబిరాల్ని ఖాళీ చేయించింది జైషే మహ్మద్. దాదాపు 325మంది ఉగ్రవాదులు, 25 నుంచి 27మంది శిక్షకులను బాలాకోట్​ అడవిలో ఉన్న స్థావరానికి తరలించింది.

పాకిస్థాన్​ అబోటాబాద్​లోని నియంత్రణ రేఖకు 80కిలోమీటర్ల దూరంలో ఉంది బాలాకోట్​. గతంలో అమెరికా దళాలు ఒసామా బిన్​ లాడెన్​ను హతమార్చింది అబోటాబాద్​లోనే.

జైషే మహ్మద్​ నేతల ధైర్యం ఒకటే. భారత దళాలు మెరుపుదాడి చేసినా... బాలాకోట్​ వరకు రావని. మహా అయితే నియంత్రణ రేఖకు సమీపంలో, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని స్థావరాలపై దాడి చేస్తారని భావించారు జైషే నేతలు.

పక్కా సమాచారం

ఉగ్రవాదులను బాలాకోట్​ స్థావరానికి తరలించినట్లు భారత బలగాలు ముందే పసిగట్టాయి. కచ్చితమైన నిఘా సమాచారంతో ఆపరేషన్​కు ప్రణాళికలు రచించాయి.

వేకువజామున 3.30గంటలు. బాలాకోట్​ స్థావరంలో ప్రతి ఒక్కరూ నిద్రలో ఉన్నారు. భారత బలగాలు నియంత్రణ రేఖ దాటి అంత లోపలకు వస్తుందని పాకిస్థాన్​ దళాలు ఊహించలేదు. ఫలితంగా భారత వాయుసేన పని నల్లేరుపై నడక అయింది. 6 బాంబుల్ని జారవిడిచాయి మిరాజ్​ విమానాలు. వందల మంది ముష్కరుల ప్రాణాలు క్షణాల్లో గాల్లో కలిశాయి.

పాక్​ను తికమకపెట్టి..

వివిధ వైమానిక స్థావరాల నుంచి బయల్దేరిన 'మిరాజ్​' విమానాలు పాకిస్థాన్​ను తికమకపెట్టాయి. వారు ఎక్కడికి వెళుతున్నారో, ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి సృష్టించింది వాయుసేన. అందులోని ఓ చిన్న వైమానిక బృందం బాలాకోట్​ వైపు పయనించింది. అక్కడే మంచి నిద్రలో ఉన్న ఉగ్రవాదులపై బాంబులతో విరుచుకుపడింది భారత వాయుసేన. వెయ్యి కిలోల పేలుడు పదార్థాలతో స్థావరాన్ని నామరూపాల్లేకుండా చేసింది.

undefined

విలాసాల అడ్డా...

ఖైబర్​ పఖ్తుంఖ్వ రాష్ట్రం కున్హర్ నదీ తీరంలో బాలాకోట్​ ఉంది. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో కొండపై జైషే స్థావరం ఉంది. ఇది ఓ ఐదు నక్షత్రాల రిసార్టును తలపిస్తుందంటారు. ఈత కొలను, వంట మనుషులు, సేవకులు.. ఇలా అన్ని సౌకర్యాలు ఉంటాయి ఇక్కడ. 500 నుంచి 700మందికి ఆశ్రయం కల్పించే వీలుంది.

ఇదే స్థావరాన్ని హిజ్బుల్ ముజాహిద్దీన్​ సంస్థ కూడా ఉపయోగిస్తోంది. జైషేకు చెందిన అత్యంత ముఖ్యమైన శిక్షణ కేంద్రమూ ఇదే.

ఈ స్థావరంలో ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చేవారంతా పాక్​ సైన్యం మాజీ అధికారులని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.