పుల్వామా ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరుల రక్తపు మరకలు మాయకముందే తీవ్రవాదానికి మరో సైనికాధికారి ప్రాణాలు కోల్పోయారు. భద్రతా బలగాలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఐఈడీలను నిర్వీర్యం చేసే క్రమంలో పేలుడు జరగడమే ఇందుకు కారణం.
జమ్ముకశ్మీర్ రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్లోని నియంత్రణ రేఖ వద్ద ఈ ఘటన జరిగింది. నియంత్రణ రేఖకు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉగ్రవాదులు ఐఈడీని అమర్చినట్లు భద్రతా సిబ్బంది గుర్తించారు. వాటిని నిర్వీర్యం చేసేందుకు వెళ్లిన బృందంలోని ఇంజినీరింగ్ అధికారి ప్రాణాలు కోల్పోగా మరో జవాను గాయపడ్డారు.
నియంత్ర రేఖ వద్ద ఐఈడీ పేలుడు సంభవించటం ఇది రెండోది. జనవరి 11న జరిగిన పేలుళ్లలో ఇద్దరు సైనిక అధికారులు మరణించారు.