ఉత్తరాఖండ్ డెహ్రాడూన్‌కు చెందిన ఆర్మీ మేజర్ చిత్రేష్ బిస్త్ జమ్మూలోని రాజౌరీ సెక్టార్లో ఇంజనీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం నౌషెరా సెక్టారులో రోజువారీ తనిఖీల్లో భాగంగా శక్తిమంతమైన ఐఈడీని గుర్తించాయి భద్రతా బలగాలు. సమాచారం అందుకున్న బిస్త్ పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేయడానికి ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో అనుకోకుండా ఐఈడీ పేలింది. బిస్త్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచారు.
తండ్రీ పోలీసే:
చిత్రేష్ బిస్త్ తండ్రి ఎస్ ఎస్ బిస్త్ పోలీసు శాఖలో విధులు నిర్వర్తించి, ఇటీవలే పదవీ విరమణ చేశారు.
అంతిమ వీడ్కోలు:
ఐఈడీ పేలుడులో అసువులు బాసిన బిస్త్ పార్థివదేహం దేహ్రాదూన్ చేరింది. సైనికులు గౌరవవందనం చేసి, నివాళులర్పించారు. అధికార లాంఛనాలతో అంతిమ యాత్రకు ఏర్పాట్లు చేశారు.