పాక్‌పై నిషేధం విధించాల్సిందిగా తీవ్రవాద ఆర్థిక కార్యకలాపాలు నియంత్రించే సంస్థ(ఎఫ్ఏటీఎఫ్)ను కోరనున్నట్లు ప్రకటించింది భారత్. పుల్వామా దాడి వెనుక పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ 'జైష్-ఏ-మహ్మద్' హస్తం ఉందనేందుకు సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డాయి భద్రతా అధికారులు.
'జైష్-ఏ-మహ్మద్' సహా వివిధ ఉగ్రవాద సంస్థలకు అవసరమైన నిధుల రాకను పసిగట్టి వాటిపై నిషేధం విధిస్తుంది ఎఫ్ఏటీఎఫ్.
పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఈ సంస్థ తీవ్రవాదులకు నిధులు ఎక్కడినుంచి అందుతున్నాయో తెలుసుకుని ఆర్థిక మూలాల్ని నిలిపివేసేందుకు తోడ్పడుతుంది. పుల్వామా ఘటనపై విచారించి పాక్‌పై నిషేధం విధించాలని కోరనుంది భారత్.
వచ్చే వారంలో జరిగే ఎఫ్ఏటీఎఫ్ తదుపరి సమావేశంలోనే భారత్ ఈ ప్రతిపాదనను తీసుకురానుంది. ఉత్తరకొరియా, ఇరాన్‌లు ఇప్పటికే ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో ఉన్నాయి.