భారత పర్యటనలో ఉన్న అర్జెంటీనా అధ్యక్షుడు మారికో మాక్రి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దిల్లీలో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడిన మోదీ.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా రెండు దేశాలు కలిసి ప్రత్యేక తీర్మానం చేశాయని తెలిపారు.
"పుల్వామాలో జరిగిన క్రూర ఉగ్రదాడితో చర్చలకు కాలం చెల్లిందని స్పష్టమైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ కలిసి పోరాడాల్సిన సమయం వచ్చింది. తీవ్రవాదులు, వారికి సహకరించేవారిని కూడా ఉగ్రవాదులుగానే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ సమావేశం అనంతరం ఇరు దేశాలు కలిసి ఉగ్రవాద నిర్మూలనకు కార్యాచరణపై ప్రత్యేక తీర్మానం చేయనున్నాం."
-నరేంద్ర మోదీ, భారత ప్రధాన మంత్రి
మోదీ-మాక్రి సమావేశం సందర్భంగా భారత్-అర్జెంటీనా 10 అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటీ, సమాచార, అణుశక్తి, వ్యవసాయ రంగాల్లో పరస్పర సహకారంపై ఈ ఒప్పందాలు కుదిరాయి.