ప్రతిపక్షాల మహాకూటమికి నాయకత్వమే లేదని ఎద్దేవా చేశారు భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్షా. తమిళనాడులో పర్యటిస్తున్న ఆయన విపక్షాల పొతుపై విమర్శనాస్త్రాలు సంధించారు. భాజపా పటిష్ట నాయకత్వం కలిగి, బలంగా ఉందని స్పష్టం చేశారు.
దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సుస్థిరంగా, పటిష్ఠంగా ఉందని అమిత్ షా అన్నారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధుల వివరాలను, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు షా.
దేశంలో రెండు కూటములున్నాయి. అందులో ఒకటి రాహుల్-విపక్షాలతో ఏర్పాటు చేస్తున్న కూటమి. దానికి నాయకులు లేరు. స్టాలిన్ ఒకసారేమో రాహులే ప్రధాని అంటారు. మరోసారి ఆ విషయంపై అసలు మాట్లాడరు. ఆయన నిర్ణయమేంటో ఎవరికీ అర్థం కాదు. అది దిశా,నిర్దేశం లేని అవినీతి పరుల కూటమి. మరొకటి ఎన్డీఏ నేతృత్వంలోని అభివృద్ధి కూటమి. డీఎంకే- కాంగ్రెస్ కూటమి వల్ల తమిళనాడు అభివృద్ధి కోసం కాదు, కేవలం అవినీతి పరులకు మాత్రమే కోసమే.- అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు