భారత్‌లోని పాక్ దౌత్యాధికారి సొహైల్ మహమూద్‌ను ఇస్లామాబాద్‌కు రావాలని ఆ దేశం సోమవారం ఆదేశించింది. పుల్వామా ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చర్చించేందుకు సొహైల్‌ను హాజరుకావాలని సూచించింది పాక్ విదేశాంగ శాఖ. సోమవారం ఉదయమే సొహైల్ పాకిస్థాన్‌కు బయలుదేరారని విదేశాంగ ప్రతినిధి మహ్మద్ ఫైజల్ తెలిపారు.
సొహైల్‌ను భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే శుక్రవారం హోం మంత్రి కార్యాలయానికి పిలిపించుకుని ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. పాక్‌లోని భారత దౌత్యాధికారి అజయ్ బిసారియాను ఇప్పటికే దిల్లీకి రావాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.