12 మిరాజ్ జెట్ ఫైటర్లు శక్తివంతమైన లేజర్ సహితమైన 1000 కేజీల బాంబులతో పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని బాల్కోట్లో జైషే మహ్మద్ శిబిరాలపై దాడులు చేసినట్లు సమాచారం అందింది. బాల్కోట్ పాక్ ఆక్రమిత కశ్మీర్లో మూల భాగంలో ఉంది. ఇది వాస్తవానికి భారత్కు చెందిన ప్రాంతం. ఐక్యరాజ్య సమితి చాప్టర్ 7 ప్రకారం స్వీయరక్షణ దాడులు నేరం కాదు . జైషే సంస్థని, మసూద్ అజర్ని ఐక్యరాజ్య సమితి ఉగ్ర సంస్థగా ప్రకటించింది. వాయుసేన దాడులు సులభం కాబట్టి భారత్ వీటిని ఎంచుకుంది. భారత వాయుసేన విమానాలు బాలకోట్ని ధ్వంసం చేశాయి. ఎంత మేర నష్టం జరిగిందో తెలియాలి. - రంజిత్ రాయ్, రక్షణ రంగ నిపుణుడు
పాక్కు అవమానకరం:ధిల్లాన్
భారత వైమానిక దాడులపై రక్షణ రంగ నిపుణుడు డీఎస్ ధిల్లాన్ స్పందించారు. దాడిలో వాడిన మిరాజ్ విమానాలు లక్ష్యాలను తప్పే అవకాశమే లేదని స్పష్టం చేశారు. దాడి జరిగిందనేది స్పష్టం అన్నారు. 80 కిలోమీటర్ల మేర పీఓకేలో దాడులు జరిగాయన్నారు. పాకిస్థాన్ సైతం ఇవే ఆరోపణలు చేస్తోందని పేర్కొన్నారు.
పాక్కు ఇది అంతర్జాతీయంగా అవమానకర సమయమని రక్షణ రంగ నిపుణుడు డీఎస్ ధిల్లాన్ పేర్కొన్నారు. ఒసామా ఆపరేషన్ తర్వాత పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాదులను చంపడం ఆ దేశానికి మచ్చగానే మిగులుతుందన్నారు. కార్గిల్ సమయంలోనూ నియంత్రణ రేఖను భారత్ దాటలేదని, కానీ ఇప్పుడు ఆ అవసరం వచ్చిందని వ్యాఖ్యానించారు.
ఎలాంటి నష్టం వాటిల్లలేదని పాక్ మీడియా ప్రసారం చేస్తున్న చిత్రాల్లో నిజం లేదని ధిల్లాన్ అన్నారు. మిరాజ్లో ఉన్న ఆయుధ వ్యవస్థ పటినష్టమైనదనీ, గురి తప్పే అవకాశమే లేదని తెలిపారు. పూర్తి వ్యూహాత్మకంగానే భారత వైమానిక దళం దాడులు జరిపిందని స్పష్టం చేశారు.