అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ కొనుగోలు కుంభకోణం కేసులో నిందితుల అభ్యర్థనలపై విచారణ చేపట్టింది దిల్లీ పటియాలా హౌజ్ కోర్టు. కొద్దిరోజుల కిందట భారత్‌కు వచ్చిన రాజీవ్ సక్సేనాకు బెయిల్ మంజూరు చేసింది. రాజీవ్ సక్సేనా కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతుండటం బెయిల్ మంజూరుకు కారణంగా తెలుస్తోంది.
ఎన్ఫోర్స్మెంట్ అభ్యర్థన మేరకు ఆయనకు 24 గంటల పాటుపోలీసులు కాపలాగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
వేసవి దుస్తులకు మిషెల్...
మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌కు తన తరపు న్యాయవాది నుంచి వేసవి దుస్తులు స్వీకరించేందుకు అనుమతించింది దిల్లీ కోర్టు. ఈ మేరకు తీహార్ జైలు అధికారులకు ఆదేశాలిచ్చింది.
ఇదీ చూడండి: 'మాట్లాడాలి రండి!'