అరుణాచల్ ప్రదేశ్లో ఉండే స్థానికేతర ఎస్టీలు, గోర్ఖాలకు శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. 18 సామాజిక విద్యార్థి, సామాజిక సంఘాలు పాటించిన బంద్ హింసాత్మకంగా మారింది.
ఆందోళనకారులు ఓ పోలీస్ స్టేషన్ను, అగ్ని మాపక కేంద్రాన్ని ధ్వంసం చేశారు. ఉపముఖ్యమంత్రి చౌనా మెయిన్ నివాస గృహాన్ని ధ్వంసం చేశారు. ఆందోళనల అణచివేతకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.
"కాంగ్రెస్ పనే"...
అరుణాచల్ ప్రదేశ్లో ఆందోళనలు హింసాయుతంగా మారడానికి కాంగ్రెస్సే కారణమని ఆరోపించింది భాజపా. ఆ పార్టీ కావాలనే ప్రజల్ని రెచ్చగొడుతోందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు.