.
గార్డెన్‌సిటీ బెంగళూరులో ఏరో ఇండియా-2019 వైమానిక ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా వైమానిక రంగంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు నిర్మల. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి పాల్గొన్నారు.
అబ్బురపరిచిన విన్యాసాలు
సారంగ్, స్వదేశీ వైమానిక తయారీ సంస్థ హెచ్ఏఎల్ రూపొందించిన లైట్ యుటిలిటీ హెలికాప్టర్ పీటీ-1, లైట్ కంబాట్ హెలికాఫ్టర్ టీడీ-2, అత్యాధునిక హెలికాఫ్టర్ రుద్ర సహా సుఖోయ్ శ్రేణి విమానం ఎస్‌యూ-30, ఎఫ్-16, ఫాల్కన్, హార్నెట్, మైటీ బీ-2 యుద్ధ విమానాల విన్యాసాలు అబ్బురపరుస్తున్నాయి.
ఇవీ చూడండి:
పైలట్‌కు నివాళి
సన్నాహకాల్లో భాగంగా మంగళవారం రెండు సూర్యకిరణ్ విమానాలు ఢీకొన్నాయి. ఘటనలో ఓ పైలట్ మరణించారు. తక్కువ వేగంతో ఓ విమానాన్ని నింగిలోకి పంపి ఆయన మృతికి సంతాపం తెలిపారు.
ఇది కూడా చూడండి:సన్నాహకాల్లో విమానాలు ఢీ