కేరళ సంక్రాంతి 'అటుకుల పొంగల్' పండుగ తిరువనంతపురంలోని అట్టుకల్ దేవి ఆలయంలో ఘనంగా ప్రారంభమైంది. అత్యంత పవిత్రమైన హోమగుండాన్ని వెలిగించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. పది రోజులపాటు జరిగే ఉత్సవాల్లో 40 లక్షల మంది మహిళలు పాల్గొంటారని చెప్పారు ఆలయ ధర్మకర్తలు. పండగ రోజుల్లో పెద్ద సంఖ్యలో మహిళలు నైవేద్యాలు సమర్పిస్తారు. రద్దీ కారణంగా నైవేద్యాలు సమర్పించేందుకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటారు చాలా మంది.
మలయాళీ నెల 'మకరం-కుంభం'లో కార్తీక నక్షత్రం వచ్చినప్పుడు ప్రారంభమయ్యే ఈ పండగను చెడుపై 'మంచి' విజయానికి గుర్తుగా భావిస్తారు.
నిరసన పొంగల్
కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ కేఎస్ ఆర్టీసీ నుంచి తొలగింపునకు గురైన మహిళా ఉద్యోగులు తిరువనంతపురంలోని సచివాలయం ఎదుట అటుకుల పొంగలి తయారు చేసి నిరసన తెలిపారు.