Vangaveeti Ranga 76th Birth Anniversary: 'వంగవీటి రాధాను జగన్ రాజకీయంగా వాడుకున్నారు' - రంగా విగ్రహానికి పూల మాల వేసి నివాళులు

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 4, 2023, 2:10 PM IST

Vangaveeti Mohana Ranga 76th Birth Anniversary : వంగవీటి మోహన్ రంగా 76వ జయంతిని విజయవాడ రంగా విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. రంగా విగ్రహానికి ఆయన తనయుడు వంగవీటి రాధా, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి, జనసేన నేత పోతిన మహేశ్ తదితరులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కులాలకి, మతాలకి అతీతంగా రంగాను రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని వంగవీటి రాధా తెలిపారు. 1987లో చైతన్య రథం సినిమా నిర్మించారని, దానిలో ఒక ఫ్రింట్ దొరికితే ఆయన పుట్టినరోజు సందర్భంగా నేడు అమెరికాలో రిలీజ్ చేశారని రాధా తెలిపారు. త్వరలో అభిమానుల కోసం సామాజిక మాధ్యమాల్లో ఆ సినిమాను ఉంచుతామని ఆయన పేర్కొన్నారు. 

వంగవీటి రంగా స్మృతివనం :  ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వంగవీటి రాధాను రాజకీయంగా వాడుకున్నారని జనసేన నేత పోతిన మహేశ్ విమర్శించారు. రాష్ట్రంలో అమలు చేస్తూన్న అనేక సంక్షేమ పథకాల్లో ఒక్క పథకానికి వంగవీటి రంగా పేరు పెట్టకపోవడమేంటని మహేశ్ సీఎం జగన్​ని ప్రశ్నించారు. రంగా పేరుతో స్మృతివనాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.