Samata Sainik Criticizes YCP Bus Yatra: సామాజిక న్యాయ యాత్ర ను అడ్డుకోవాలని... సమతా సైనిక్ దళ్ పిలుపు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 25, 2023, 8:16 PM IST
Samata Sainik Dal Allegations on jagan Bus Yatra: సామాజిక న్యాయయాత్ర పేరుతో వైసీపీ చేపట్టిన బస్సు యాత్రను అడ్డుకోవాలని సమతా సైనిక్ దళ్ పిలుపునిచ్చింది. ఎస్సీ, ఎస్టీలు నావాళ్లు అని చెప్పుకుంటూ... వారికి లబ్ధి చేకూరే పథకాలను సీఎం జగన్ ఎత్తేశారని సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వరరావు అన్నారు. ఉన్నత పదవులన్నీ నచ్చిన వర్గాలకు ఇచ్చి.. దళితులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అంబేడ్కర్ పేరుతో ఉన్న విదేశీవిద్య పథకాన్ని తీసేసి.. జగనన్న విదేశీ విద్య అని పేరు మార్చాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నించారు. నూతనంగా నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో దళితులకు చెందాల్సిన సగం సీట్లను ఏ, బి, సి కేటగిరిలుగా విభజించి విక్రయించారని ఆరోపించారు. డాక్టర్ సుధాకర్ మృతికి ప్రభుత్వమే కారణమని మహేశ్వరరావు ఆరోపించారు. దళిత కారు డ్రైవర్ సుబ్రమణ్యంను చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుకు ఆరునెలల్లోనే బెయిల్ ఇప్పించారని తెలిపారని ఆరోపించారు. అధికార పార్టీలో ఉన్న దళిత నేతలే దళిత ద్రోహులని విమర్శలు గుప్పించారు. గోబ్యాక్ సామాజిక న్యాయయాత్ర అని నినదించాలని పిలుపునిచ్చారు. సీఎం జగన్ చేపట్టబోయే బస్సు యాత్రను అడ్డుకోవాలని మహేశ్వరరావు ప్రజలను కోరారు.