Huge King Cobra in Anakapally District : అమ్మో..! 13 అడుగుల కింగ్ కోబ్రా.. చూడగానే పరుగు తీసిన రైతులు - Huge King Cobra in Anakapally District
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 6, 2023, 3:36 PM IST
Huge King Cobra in Anakapally District: అనకాపల్లి జిల్లాలో భారీ కింగ్‌కోబ్రాను చూసిన రైతులు హడలెత్తిపోయారు. 13 అడుగుల పొడవున్న ఈ కింగ్‌కోబ్రా.. పొలంలో పనిచేసుకుంటున్న రైతుల కంట పడగానే పరుగులు తీశారు. స్నేక్ క్యాచర్‌కి సమాచారం అందించగా.. ఆయన అక్కడికి చేరుకుని.. చాకచాక్యంగా దాన్ని బంధించి తిరిగి అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టాడు. దీంతో ఆ రైతులు ఊపిరి పీల్చుకున్నారు.
జిల్లాలోని మాడుగుల మండలం ఎం. కోడూరు గ్రామానికి చెందిన.. ఎలమంచిలి రమేశ్ అనే రైతుతో పాటు మరికొంత మంది రైతులు పొలంలో పనిచేసుకుంటున్నారు. ఈ సమయంలో అక్కడే మరో పాముని వెంబడిస్తూ.. కింగ్‌కోబ్రా కోళ్ల పొలంలోని కోళ్ల షెడ్డులోకి దూరింది. దీంతో రైతులు అక్కడి నుంచి భయంతో పరుగులు తీశారు. దీంతో మడుగులకు చెందిన వెంకటేశ్ అనే స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందిచారు. అక్కడికి చేరుకున్న వెంకటేశ్.. కింగ్‌కోబ్రాను సంచిలో బంధించారు. కింగ్‌కోబ్రా దాదాపు పది కిలోల వరకు బరువు ఉందని స్నేక్ క్యాచర్ తెలిపారు. అనంతరం దానిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.