Clash Between Devotees and Temple Staff at Mahanandi Temple: మహానందిలో భక్తులకు ఆలయ సిబ్బంది మధ్య ఘర్షణ - ap news
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 7, 2023, 11:50 AM IST
Clash Between Devotees and Temple Staff at Mahanandi : ప్రముఖ పుణ్యక్షేత్రం మహానందిలో ఉచిత దర్శనం విషయమై భక్తులు, యాత్రికులు, దేవస్థానం ఉద్యోగులు ఘర్షణ పడ్డారు. ఆలయ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా మహానంది శివారులోని సత్యసాయి ధ్యాన మండలిలో జరిగిన శిక్షణకు వచ్చిన శ్రీసత్యసాయి జిల్లా నార్పల మండలానికి చెందిన కొందరు ఉచిత దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో మహా మంగళ హారతి సేవలు ఉన్నందున అరగంట తర్వాత పంపుతారని దేవస్థానం సిబ్బంది తెలిపినట్లు సమాచారం. కొందరు మద్యం మత్తులో ఈవో ఎవరు? ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడంతో వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించిన సందర్భంలో ఇరు వర్గాల మధ్య తోపులాట, ఘర్షణ జరిగినట్లు సిబ్బంది చెబుతున్నారు. పరస్పరం దాడి చేసుకున్నారు. అనంతరం భక్తులు ఆలయ ఆవరణలో బైఠాయించి నిరసన (Devotees Protest in Temple) తెలిపారు. ఈ పంచాయితీ స్థానిక పోలీసు స్టేషన్కు చేరింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.