ఉద్ధృత రూపం దాల్చిన బైరవకోన - పర్యాటక కేంద్రం మూసివేత
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 5, 2023, 7:33 PM IST
Bairavakona Tourism Center Closed: మిగ్‌జాం తుపాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో అధికంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురిసిన వర్షానికి ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం బైరవకోన పర్యాటక కేంద్రం వద్ద.. జలపాతం ఉద్ధృత రూపం దాల్చింది. కొండలపై నుంచి వర్షం నీరు అధికంగా ఉండడంతో.. జలపాతం వద్ద నీళ్లు అధికంగా కిందికి జాలు వారుతున్నాయి. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు.. పర్యాటకులను జలపాతం వద్దకు రాకుండా చర్యలు చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని పంటలు ఇప్పటికే నీటమునిగాయి. పలుచోట్ల మిరప, పొగాకు పంటలు ధ్వంసమయ్యాయి.
ఇప్పటికే పలు ప్రాంతాల్లోకి పర్యాటకులు ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పలు జిల్లాల్లోని వాగులు వంకలు పొంగిపొర్లుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే పాపికొండల విహారయాత్రకు గండి పోచమ్మ ఆలయం నుంచి బోట్లను నిలిపివేసిన సంగతి తెలిసిందే.