ETV Bharat / sukhibhava

Brain Tumor Day: మెదడులో.. కణితి ఎలా ఏర్పడుతుంది?

అన్ని అవయవాల పనితీరును నియంత్రించేది, నిర్వర్తించేది మెదడే. ఇంతటి కీలకమైన మెదడులో కణితి (ట్యూమర్‌) ఏర్పడితే? ఎవరికైనా ఆందోళన సహజమే. నిజానికి మెదడు కణితులన్నీ క్యాన్సర్‌ కానవసరం లేదు. మామూలువీ కావొచ్చు. వీలైనంత త్వరగా గుర్తిస్తే కొన్ని కణితులను పూర్తిగా నయం చేయొచ్చు. కావాల్సింది అవగాహనే. వరల్డ్‌ బ్రెయిన్‌ ట్యామర్‌ డే సందర్భంగా మెదడు కణితులపై సమాచారం మీకోసం.

Special story on Brain Tumor Day
Special story on Brain Tumor Day
author img

By

Published : Jun 8, 2021, 7:53 AM IST

కణితి అంటే? ఒక నియంత్రణ అనేదే లేకుండా, అసాధారణంగా కణాలు పెరిగిపోవటం. ఇవన్నీ ఒక ముద్దలా, కాయలా తయారవటం. సాధారణంగా మన ఒంట్లోని కణాలు ఒక దశకు వచ్చాక మరణిస్తుంటాయి. వీటిని భర్తీ చేయటానికి కొత్తవి పుట్టుకొస్తుంటాయి. ఎందుకనో కొన్నిసార్లు ఈ ప్రక్రియ దెబ్బతింటుంది. పాత, దెబ్బతిన్న కణాలు మరణించకపోయినా వాటి స్థానంలో కొత్త కణాలు పుట్టుకొస్తుంటాయి. ఇవే ఒకదగ్గర పోగుపడుతూ చివరికి కణితిలా మారతాయి. ఇవి శరీరంలో ఎక్కడైనా తలెత్తొచ్చు. మెదడూ వీటికి మినహాయింపు కాదు. మెదడు కణితులు అక్కడే పుట్టుకురావొచ్చు (ప్రైమరీ). ఇలాంటి కణితులు పిల్లల్లో ఎక్కువ.

.
.

కొన్ని కణితులు ఇతర అవయవాల నుంచి వచ్చి మెదడులో తిష్ఠ వేయొచ్చు (సెకండరీ). వీటినే బ్రెయిన్‌ మెటాస్టాటిస్‌ ట్యూమర్లనీ అంటారు. ఇతర అవయవాల నుంచి వచ్చే క్యాన్సర్‌ కణాలు మెదడులో అక్కడక్కడా సముదాయాలుగా పోగు పడి కణితులుగా వృద్ధి చెందొచ్చు. లేదూ మెదడు పొర మీద వ్యాపించొచ్చు (కార్సినోమాటస్‌ ఆఫ్‌ మెనింజైటిస్‌). సెకండరీ ట్యూమర్లు పెద్దవారిలో ఎక్కువ. వీరిలో మెదడు కణితుల్లో దాదాపు 90% ఇలాంటివే. సాధారణంగా మెదడులో తలెత్తే ట్యూమర్లు అక్కడే ఉంటాయి. ఇతర అవయవాలకు విస్తరించవు. ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవు కూడా.

రకరకాలు

మెదడులో కణితులు ఏర్పడిన చోటును బట్టి రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. ఉదాహరణకు- గ్లయల్‌ కణాల్లో కణితి మొదలైతే గ్లయోమా అంటారు. పిల్లల్లో మెడుల్లా బ్లాస్టోమా (ప్రిమటివ్‌ న్యూరో ఎక్టో డర్మల్‌ ట్యూమర్లు).. గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 2 ఆస్ట్రోసైటోమా.. ఎపెండిమోమా, బ్రెయిన్‌ స్టెమ్‌ గ్లయోమా రకం కణితులు ఎక్కువగా చూస్తుంటాం. ఇవి సెరిబెల్లమ్‌, మెడుల్లా కలిసే చోట.. అంటే తలలో వెనకాల మెడ పైభాగంలో ఏర్పడుతుంటాయి. ఇక పెద్దవారిలో ఆస్ట్రోసైటోమా, మెనింజియోమా, ఓలిగొడెండ్రోగ్లయోమా రకం కణితులు ఎక్కువ. గ్రేడులను బట్టి కణితుల తీవ్రతను లెక్కిస్తారు. గ్రేడ్‌ 3, గ్రేడ్‌ 4 కణితులను అనప్లాస్టిక్‌ ఆస్ట్రోసైటోమా, గ్లయోబ్లాస్టోమా అంటారు. ఇవి క్యాన్సర్‌ కణితులు. త్వరగా ముదురుతాయి. పెద్దవాళ్లలో కనిపించే మరో కణితి కేంద్ర నాడీ వ్యవస్థ లింఫోమా. నిజానికి మెదడులో లింఫ్‌ వ్యవస్థ ఉండదు. అయినా మెదడులో లింఫోమా ఎందుకు ఏర్పడుతుందనేది తెలియదు.

ఎవరికైనా రావొచ్చు

మెదడు కణితులు ఎవరికైనా, ఏ వయసులోనైనా రావొచ్చు. మెదడు కణితులు పెద్దవాళ్లలో కాస్త తక్కువే అనుకోవచ్చు. మొత్తం కణితుల్లో ఇవి 1-2 శాతమే. కానీ పిల్లల్లో తరచూ చూస్తుంటాం. ఇవి ఎందుకు ఏర్పడతాయన్నది కచ్చితంగా తెలియదు. కొన్నిరకాల కణితులకు ఆయా జన్యువుల్లో మార్పులు కారణం కావొచ్చని భావిస్తున్నారు. మొబైల్‌ ఫోన్ల వంటివి అతిగా వాడటం వల్ల మెదడులో కణితులు వస్తాయని అనుకుంటుంటారు గానీ ఇది నిరూపణ కాలేదు.

అన్ని కణితులూ క్యాన్సర్లు కావు

మెదడులో కణితి ఉన్నంత మాత్రాన క్యాన్సర్‌ కానవసరం లేదు. మామూలు కణితులూ ఉండొచ్చు. ఉదాహరణకు- శ్రవణ నాడి మీద తలెత్తే ఎకోస్టిక్‌ న్యూరోమా లేదా ష్వానోమా. దీన్ని శస్త్రచికిత్స చేసి తొలగించొచ్చు. శస్త్రచికిత్స చేయలేకపోతే స్టిరియోటాక్టిక్‌ రేడియేషన్‌ చేయొచ్చు. పీయూష (పిట్యుటరీ) గ్రంథి మీద తలెత్తే మామూలు కణితులు హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీయొచ్చు. దీంతో కాళ్లు చేతులు బాగా పెరిగిపోయి, పొడవుగా అవుతుంటారు (యాక్రోమెగాలే). పీయూష గ్రంథి వెనకాల కణితుల మూలంగా మగవారిలో, ఆడవారిలో రొమ్ముల్లోంచి పాలు రావొచ్చు.

లక్షణాలు

మెదడులో కణితులు ఉన్న చోటును బట్టి లక్షణాలు కనిపిస్తుంటాయి. వీటికి మూలం- కణితి మూలంగా పుర్రె లోపల ఒత్తిడి పెరగటం.

తలనొప్పి: ఇది ప్రధానమైన లక్షణం. నొప్పి తీవ్రంగా, విడవకుండా వేధిస్తుంటుంది. ఉదయం పూట మరింత ఎక్కువగానూ ఉంటుంది. దగ్గు, నవ్వు, అరవటం, ముందుకు వంగటం, వ్యాయామం చేయటం వంటివి తలలో ఒత్తిడి పెరిగేలా చేస్తాయి. ఇలాంటి సమయాల్లో ఏదో పొడుస్తున్నట్టుగా నొప్పి వస్తుంటుంది.

ఫిట్స్‌: మెదడు కణితుల్లో ఫిట్స్‌ తరచూ చూస్తుంటాం. అందుకే పెద్దవాళ్లలో కొత్తగా ఫిట్స్‌ వస్తే మెదడులో కణితులను అనుమానించటం తప్పనిసరి.

ఆయా భాగాల్లో కణితులను బట్టి..
మస్తిష్క మూలంలో ఉంటే- మెదడులో నిరంతరం ద్రవం ఉత్పత్తి అవుతుంటుంది. కణితులు దీన్ని అడ్డుకుంటే మగత, మల మూత్ర విసర్జనపై పట్టు తప్పటం, ముద్ద మింగలేకపోవటం, మాట్లాడటంలో ఇబ్బంది, అడుగులు సరిగా వేయలేకపోవటం, రెండు దృశ్యాలు కనిపించటం, నవ్వినప్పుడు పెదాలు ఒక వైపునకు వెళ్లటం వంటివి బయలుదేరతాయి.

  • సెరిబెల్లమ్‌లో ఉంటే- కళ్లు వాటంతటవే కదలటం, వాంతి, మెడ బిగపట్టటం.. నడక, మాట తడబడటం.
  • కణత భాగంలో ఉంటే- మాట్లాడటంలో ఇబ్బంది, మతిమరుపు, అకారణ భయం, విచిత్రమైన వాసనలు.
  • ఆక్సిపిటల్‌ లోబ్‌లో ఉంటే- క్రమంగా ఒక కంట్లో చూపు తగ్గటం. కణితి కుడివైపున ఉంటే ఎడమ కంటి చూపు, ఎడమవైపున ఉంటే కుడి కంటి చూపు తగ్గుతూ వస్తుంది.
  • పెరైటల్‌ లోబ్‌లో ఉంటే- చదవటం, రాయటం, తేలికైన లెక్కలు చేయటంలో ఇబ్బంది.. శరీరం ఒక పక్క మొద్దుబారటం లేదా బలహీనపడటం.. పదాలను అర్థం చేసుకోవటానికి, మాట్లాడటానికి ఇబ్బంది పడటం.
  • ఫ్రాంటల్‌ లోబ్‌లో ఉంటే- శరీరంలో ఒక వైపు స్థిరంగా లేకపోవటం, బలహీనపడటం.. వ్యక్తిత్వం, ప్రవర్తనలో మార్పులు, వాసన పోవటం.

బయాప్సీతో నిర్ధారణ

క్యాన్సర్‌ను అనుమానిస్తే ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయాల్సి ఉంటుంది. ఒక్క కణితులతోనే కాదు.. మెదడులో క్షయ, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లతోనూ ఫిట్స్‌ రావొచ్చు. రక్తనాళం చిట్లి రక్తం గడ్డ కట్టినా ఫిట్స్‌ రావొచ్చు. ఇలాంటి సమస్యలేవైనా ఉన్నాయేమో తెలుసుకోవటానికి ఎంఆర్‌ఐ విత్‌ స్పెక్ట్రోస్కోపీ చేస్తారు. దీంతో కణితి క్యాన్సరా? కాదా? అన్నది బయటపడుతుంది. క్యాన్సర్‌ను అనుమానిస్తే కణితి నుంచి చిన్న ముక్కను తీసి పరీక్షిస్తారు (బయాప్సీ). క్యాన్సర్‌ ఉంటే నిర్ధారణ అవుతుంది. కణితి చాలా లోతులో ఉంటే (బ్రెయిన్‌స్టెమ్‌ గ్లయోమాల వంటివి) బయాప్సీ చేయటం కుదరదు. బయాప్సీ చేస్తే ప్రాణాపాయానికి దారితీయొచ్చు. వీటిని ప్రత్యేక కణితులుగా భావించి, ఎంఆర్‌ఐ ఫలితాలను బట్టే చికిత్సను నిర్ణయిస్తారు.

ప్రత్యేక కీమో మందులు

మెదడు కణితులకు ఇచ్చే కీమోథెరపీ మందులు ప్రత్యేకమైనవి. మామూలుగా శరీరంలో ఇతర భాగాల్లో తలెత్తే క్యాన్సర్లకు రక్తనాళం ద్వారా గానీ మాత్రలు లేదా గొట్టాల రూపంలో గానీ కీమో మందులు ఇస్తుంటారు. ఇవి మెదడులోకి చేరుకోలేవు. ఎందుకంటే మెదడులోకి హానికారక పదార్థాలు, విషతుల్యాలు వెళ్లకుండా కాపాడే ‘బ్లడ్‌ బ్రెయిన్‌ బారియర్‌’ వీటిని అడ్డుకుంటుంది. దీన్ని దాటుకొని మెదడులోకి వెళ్లేలా చేయాలంటే మందులను పెద్ద మొత్తంలో ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తే ఇతర అవయవాల మీద ఎక్కువ దుష్ప్రభావం పడుతుంది. మెదడు మీద మందుల ప్రభావమూ అంతంతగానే ఉంటుంది. అందుకే బ్రెయిన్‌ బారియర్‌ను తేలికగా అధిగమించే కొన్నిరకాల కీమో మందులనే చికిత్సలో వాడుతారు. ఇవి కొవ్వులో కరిగే మందులు. చిన్న చిన్న అణువులతో కూడుకొని ఉంటాయి. రక్తంలో మాదిరిగానే అంతే మోతాదుతో మెదడులోకి చేరుకోవటం వీటి ప్రత్యేకత.

చికిత్స- కీమో, రేడియేషన్‌, శస్త్రచికిత్స

మెదడు కణితుల చికిత్సలో ట్యూమర్‌ బోర్డు చాలా కీలకం. ఇందులో క్యాన్సర్‌, రేడియాలజీ, పాథాలజీ, సైకాలజీ, ఎండోక్రైనాలజీ, ఫిజియోథెరపీ నిపుణులంతా పాల్గొంటారు. కణితుల రకాలు, పరిమాణం, కణితులు ఉన్నచోటు, వ్యక్తుల ఆరోగ్యస్థితిని బట్టి చికిత్సను నిర్ణయిస్తారు. కణితులను శస్త్రచికిత్సతో అక్కడికక్కడే గానీ మందుల ద్వారా గానీ నియంత్రించొచ్చు. కొన్ని కణితులను పూర్తిగానూ నయం చేయొచ్చు. గ్రేడ్‌ 1, గ్రేడ్‌ 2 ఆస్ట్రోసైటోమా.. కేంద్ర నాడీ వ్యవస్థ లింఫోమాలు.. అలాగే చిన్న పిల్లల్లో వచ్చే మెడుల్లా బ్లాస్టోమా పూర్తిగా నయమయ్యే అవకాశముంది.

శస్త్రచికిత్స: సాధారణంగా మామూలు కణితులకు, మెదడులోనే పుట్టిన క్యాన్సర్‌ కణితులకు ముందుగా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మెదడు పనితీరు మరింత దెబ్బతినకుండా కణితిని వీలైనంత వరకు తొలగించటం దీని ఉద్దేశం. మామూలు కణితులు శస్త్రచికిత్సతోనే నయమవుతాయి. ఇవి మళ్లీ వచ్చే అవకాశం తక్కువ. కాకపోతే 10% మందికి తిరిగి రావొచ్చు.

కీమోథెరపీ, రేడియేషన్‌: కణితులకు శస్త్రచికిత్స చేశాక కీమోథెరపీ, రేడియేషన్‌ అవసరమవుతుంది. కొన్ని కణితులకు శస్త్రచికిత్స సాధ్యం కాకపోవచ్చు.

  • ముందు కీమోథెరపీ అవసరపడొచ్చు. అందువల్ల అవసరాన్ని బట్టి కీమో, రేడియేథెరపీలను చేస్తారు.
  • మెడుల్లా బ్లాస్టోమాతో బాధపడే ఏడాది, రెండేళ్లలోపు పిల్లలకు ముందుగా కీమోథెరపీ ఇస్తారు. కణితుల సైజు తగ్గాక శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. నాలుగేళ్ల వయసు దాటిన పిల్లలకైతే రేడియేషన్‌ ఇస్తారు. వీరిలో ఎదుగుదల, మేధోశక్తి అన్నీ మామూలుగానే ఉంటాయి. ఎలాంటి లోపాలు ఉండవు.
  • గ్లయో బ్లాస్టోమా రకం కణితులకు శస్త్రచికిత్స కుదరదు. అయితే ఇప్పుడు వినూత్నమైన జన్యుపరీక్ష పద్ధతులు, చికిత్సలు కొత్త ఆశలను చిగురింపజేస్తున్నాయి. కణితి నుంచి తీసిన ముక్కను జన్యుపరీక్ష చేసి, వీటిల్లో తలెత్తిన మార్పులను బట్టి తగు కీమోథెరపీ మందును ఎంచుకోవటానికి వీలుంటున్నట్టు ఇటీవలి అనుభవాలు చెబుతున్నాయి. దీంతో మరింత మంచి ఫలితం కనిపిస్తుంది. గ్లయో బ్లాస్టోమాలో కొత్త రక్తనాళాలు వృద్ధి చెందే అవకాశమూ ఎక్కువే. అందువల్ల కీమో, రేడియేషన్‌ చికిత్సలతో పాటు డివోసుజుమాబ్‌ మందు ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో కణితి బాగా కుంచించుకుపోతుంది.
  • కేంద్ర నాడీ వ్యవస్థ లింఫోమాకు ముందు కీమోథెరపీ చేసి, 9 నెలల పాటు రేడియేషన్‌ ఇస్తే పూర్తిగా నయమైపోతుంది.
  • ఇతర అవయవాల నుంచి వచ్చి ఒక్కచోటే ఏర్పడిన కణితులను ఇంతకుముందు శస్త్రచికిత్స చేసి తొలగించేవారు. ఇప్పుడు స్టిరియోటాక్టిక్‌ రేడియేషన్‌ థెరపీ ఇస్తున్నారు. ఇందులో ఒకేచోట పెద్దమొత్తంలో రెండు మూడు సార్లు రేడియేషన్‌ ఇస్తారు. దీంతో 2-4 సె.మీ. కణితులు పూర్తిగా మాడిపోతాయి. ఇతర అవయవాల నుంచి వచ్చిన కణితులకు టైరోసిన్‌ కైనేజ్‌ ఇన్‌హిబిటార్స్‌ రకం మందులు సైతం బాగా ఉపయోగపడతాయి. ఇవి క్యాన్సర్‌ కణాల విభజన, వృద్ధిని ప్రేరేపించే కారకాలను అడ్డుకుంటాయి. కాకపోతే మెదడు పొర మీద విస్తరించిన కణితులను నయం చేయటం కష్టం.
  • పీయూష గ్రంథి వద్ద ఏర్పడిన కణితులను ముక్కులోంచి గొట్టాన్ని పంపించి శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. ఇది సాధ్యం కాకపోతే స్టిరియోటాక్టిక్‌ రేడియేషన్‌ అయినా చేయొచ్చు.

ప్రోటాన్‌ చికిత్స

ప్రస్తుతం అధునాతన ప్రోటాన్‌ చికిత్స బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. ఇదో రకం రేడియేషన్‌ పద్ధతి. ఇందులో ఫొటాన్లకు బదులు ప్రొటాన్లను వాడతారు. క్యాన్సర్‌ కణాలను చంపే ఇది పిల్లల్లో మంచి ఫలితం కనబరుస్తున్నట్టు ఇటీవలి అనుభవాలు చెబుతున్నాయి. దుష్ప్రభావాలూ తక్కువే.

ఇదీ చదవండి:

Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.