ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిదేనని.. కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. వైకాపా తరఫున శాసనసభ్యునిగా కొనసాగుతున్నందుకు సంతోష పడుతున్నానని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... విధ్వంసం అనే పుస్తకాన్ని విడుదల చేశారని.. ఆయన విధ్వంసం అనే పదాన్ని సరిగ్గా పలకగలిగితే తాను పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. లోకేశ్ రాజకీయ బాలుడు అని ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు తెదేపా నేతలకు లేదన్నారు.
ఇవీ చదవండి: