కడప శివారులోని రామాంజనేయపురం వద్ద సాగర్ కాలనీ, విద్యుత్ కాలనీ, ఏపీ రెసిడెన్షియల్ కాలనీ ఉన్నాయి. ఇక్కడ కొన్ని వందల మంది జీవిస్తున్నారు. ఈ కాలనీలకు ఇప్పటివరకు సరైన రోడ్డు వసతి లేదు. వర్షాకాలం వచ్చిందంటే మోకాళ్ల లోతు వరకు వర్షపు నీరు నిల్వ ఉంటాయి. అన్ని మట్టిరోడ్లు కావడంతో అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితి ఉంటుంది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక అధికారులు, నేతల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా స్పందించలేదు. ఇక చేసేదేమీ లేక స్థానికులంతా చందాలు వేసుకుని రోడ్డు నిర్మించుకున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యను పూర్తిగా పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండీ...అంగళ్లలో ఉద్రిక్తత...తెదేపా నేతలపై వైకాపా కార్యకర్తలు దాడి