కడప రిమ్స్‌లో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో కరోనా బాధిత బంధువులకు, యాచకులకు, అనాథలకు, అన్నదానం చేశారు. వారికి చిత్రాన్నం, కోడిగుడ్డును అందజేశారు. ఒక్కోరోజు ఒక్కో రకమైన భోజనాన్ని ఏర్పాటు చేస్తానని తెలిపారు. కరోనాతో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారని… అలాంటి వారిని దృష్టిలో ఉంచుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కూడా స్పందన కార్యక్రమానికి వచ్చే బాధితుల కోసం కలెక్టరేట్ ఎదుట ఆరేళ్లపాటు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ప్రభుత్వం చేయాల్సిన ఈ పనులను తేదేపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని….. కరోనా ఉన్నంతవరకు ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తానని పేర్కొన్నారు.
ఇదీ చూడండి. ఎల్లో ఫంగస్ వ్యాప్తి.. యూపీలో తొలి కేసు