పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గి కోరారు. కడప జిల్లా బద్వేలు మండలం అనంతరాజపురం గ్రామంలో నామినేషన్ల స్వీకరణ ఘట్టాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమయ్యారు. నామినేషన్ల సమస్యపై గ్రామస్తులు ఆయనతో చర్చించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగకుండా మంచి పాలన అందించే ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు డీఎస్పీ విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పల్లె పోరులో నిర్వాసితులకు దక్కని హక్కు