విద్యుత్తు చార్జీలు పెంపుపై వస్తున్న అపోహలను ఎవరూ నమ్మవద్దని కడప జిల్లా రాజంపేట విద్యుత్ డివిజనల్ అధికారి చంద్రశేఖరరావు అన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి మాత్రమే కొత్త టారిఫ్ అమల్లోకి వచ్చిందని.. దీని ప్రకారం 500 యూనిట్లుపైన విద్యుత్ వాడిన వారికి కొద్దిగా ఛార్జీలు పెరిగాయని తెలిపారు. మిగిలిన వారందరికీ టారిఫ్‌లో ఎలాంటి తేడా ఉండదని స్పష్టం చేశారు.
మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి ఒకేసారి రీడింగ్ తీసి.. అందులో మార్చి నెలకు పాత టారీఫ్ ప్రకారం, ఏప్రిల్ నెల నుంచి కొత్త టారిఫ్ ప్రకారం బిల్లు వేశామని చెప్పారు. ఇందులో ఇదివరకే చెల్లించిన మార్చి నెల బిల్లును తగ్గించామన్నారు. ప్రజలపై అదనపు భారం మోపలేదని.. ఈ ఏడాది జూన్ వరకు బిల్లు చెల్లించే వెలసుబాటు కల్పించామని వివరించారు.
ఇవీ చదవండి.. కరోనాపై అవగాహన.. కళాకారుల నాటక ప్రదర్శన