ETV Bharat / state

ద్విచక్రవాహనం కనిపిస్తే వదలడు.. ఈ పాత్రల వ్యాపారి...! - two wheelers thier arrests by maidukur police

అతనో సిల్వర్ పాత్రల వ్యాపారి... ఊరూరా తిరిగి పాత్రలు అమ్మటంతో పాటూ ద్విచక్రవాహనాలు దొంగతనం చేసేవాడు. కడప, కర్నూలు జిల్లాల్లో దాదాపు 22 టీవీఎస్​ ఎక్స్​ఎల్​ వాహనాలను చోరీ చేసిన ఈ ఘరానా దొంగను మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులకు చిక్కిన ద్విచక్రవాహన దొంగ
author img

By

Published : Oct 30, 2019, 1:45 PM IST

పోలీసులకు చిక్కిన ద్విచక్రవాహన దొంగ
ఊరూరా తిరిగి పాత్రల వ్యాపారం చేస్తూ ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తున్న నిందితుణ్ని కడప జిల్లా మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు జిల్లా చాగలమర్రికి చెందిన ఫకృద్దీన్​ ఊరూరా తిరిగి పాత్రలు అమ్ముతూ గ్రామాల్లో టీవీఎస్​ ఎక్స్​ఎల్​ వాహనాలను దొంగలించేవాడు. అలా ఒకటి కాదు, రెండు కాదు మొత్తం 22 టీవీఎస్​ ఎక్సెల్​ వాహనాలు తస్కరించాడు. వరుస ఫిర్యాదులతో విచారించిన పోలీసులు.. నిఘా ఉంచి నిందితుడి ఆట కట్టించారు. అపహరించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని మైదుకూరు సీఐ మదుసూదన్​ తెలిపారు. అప్పుల బాధ తట్టుకోలేకే ఫకృద్దీన్​ దొంగతనాలకు పాల్పడినట్లు వివరించారు.

ఇదీ చదవండి:

ప్రయాణికులే లక్ష్యం... కాపుకాసి బంగారు ఆభరణాలు మాయం

Intro:కేంద్రం : మైదుకూరు
జిల్లా : కడప
విలేకరి పేరు : ఎం.విజయభాస్కరరెడ్డి
చరవాణి సంఖ్య : 9441008439

AP_CDP_27_29_VO_BYKES_SVADHEENAM_AP10121Body:వృత్తి సిల్వర్‌ పాత్రల వ్యాపారం
ప్రవృత్తి ద్విచక్ర వాహనాల చోరీ

కర్నూలు, కడప జిల్లాల్లో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడిన కర్నూలు జిల్లా చాగలమర్రి వాసి గంటల ఫకృద్దీన్‌ను మైదుకూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీవీఎస్‌ ఎక్సెల్‌ రకానికి చెందిన 22 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ద్విచక్ర వాహనంపై గ్రామాలకు వెళ్లి సిల్వర్‌ పాత్రల వ్యాపారంతో జీవనం చేస్తున్న ఫకృద్దీన్‌ వ్యాపారం కలిసి రాక అప్పులు పెరిగి పోవడంతో ద్విచక్ర వాహనాల చోరీని ప్రవృత్తిగా ఎంచుకున్నారని విలేకరుల సమావేశంలో డీఎస్పీ విజయ్‌కుమార్‌ వెల్లడించారు. రెండు ప్రాంతాల్లో దాచిపెట్టిన రూ.5.65 లక్షల విలువ చేసే ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో సీఐ మధుసూదన్‌గౌడ్‌, ఎస్‌ఐలు సుబ్బారావు, వెంకటరమణలు పాల్గొన్నారు.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.