కడప జిల్లా రాజంపేటలో ఎన్ఎస్ఎస్ జిల్లాస్థాయి యువజనోత్సవాలు ఘనంగా జరిగాయి. స్థానిక అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో నృత్య, పాటల పోటీలతోపాటు రంగవల్లి, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి ఈ పోటీలకు వచ్చిన యువతీ యువకులు నువ్వా-నేనా అన్నట్టు తలపడ్డారు. ఈ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభించిన ఆర్టీవో ధర్మ చంద్రారెడ్డి... విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. తాను చదువుకున్న రోజుల్లో ఎన్ఎస్ఎస్ విద్యార్థిగా ఉండి... ఉన్నత చదువుల్లో రాణించినట్లు తెలిపారు. ఎన్ఎస్ఎస్ భావజాలంతోనే ఉద్యోగంలో పని చేస్తున్నట్లు వివరించారు. ప్రతి ఒక్కరు సేవాభావంతో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పని చేయాలని ఆర్డీవో పిలుపునిచ్చారు.
ఇదీ చూడండి: మోపిదేవి గ్రామం... ముగ్గుమనోహరం...