జమ్మలమడుగు పట్టణంలో నాగులచవితి పండుగను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక నాగలకట్ట వీధిలోని చౌడేశ్వరిదేవి దేవస్థానం ఆవరణలో ఉన్న పుట్ట వద్ద మహిళలు పూజలు చేశారు. అనంతరం పుట్ట చుట్టు చేరి పాలు పోసి నువ్వుల పిండితో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలతో పాటు పురుషులు నాగుల చవితి వేడుకల్లో పాల్గొనటం విశేషం .నాగులు వద్ద మహిళలు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు చేశారు. చీరలు ,పూలు ,పండ్లు ఉంచి మొక్కులు తీర్చుకున్నారు.సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలని విశేష పూజలు నిర్వహించారు.
ఇదీచూడండి.వరద బాధితులకు అండగా ఉండండి : చంద్రబాబు