కడప జిల్లా మైదుకూరు మహిళా పోలీసులకు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి స్కూటీలను వితరణగా అందజేశారు. గురువారం పోలీస్‌స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో వాహనాలను జిల్లా ఎస్పీ అన్భురాజన్కు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. మహిళల సమస్యలపై ముఖ్యమంత్రి స్పందిస్తూ వాటిని పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారని అన్నారు.
అందుకే మహిళల పేరునే ఇళ్ల పట్టాలు, అమ్మఒడి ఇస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐలు మధుసూదన్ గౌడ్, కొండారెడ్డి, ఇతర వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: