అటు కేసీ కాలువ.. ఇటు తెలుగుగంగ వ్యవస్థలు అందుబాటులో ఉన్నా రాయలసీమ కూడలి పట్టణం- మైదుకూరు మాత్రం నీటి కష్టాలతో విలవిలలాడుతోంది. పలు ప్రాంతాల్లో ఇక్కట్లు ముంచుకొస్తున్నాయి. స్థానిక అన్న క్యాంటీన్ భవనం వద్ద బోరు చెడిపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాలవారు ఇక్కట్లే ఎదుర్కొంటున్నారు. బోరుకు మరమ్మతు చేసి సమస్య పరిష్కరించాలని అక్కడి మహిళలు సోమవారం నిరసన బాట పట్టారు. ఖాళీ బిందెలు ప్రదర్శించి నినాదాలు చేశారు. పంచాయతీ రాజ్ ఏఈ మధుసూదన్‌బాబు స్పందిస్తూ వెంటనే మరమ్మతు చేయిస్తామని హామీనిచ్చారు.
ఇదీ చదవండి.. ఇక పై తల్లి ఖాతాలోనే ఫీజ్‌రీయింబర్స్‌మెంట్