కడప జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, వీరబల్లి, సంబేపల్లి, గాలివీడు, రామాపురం, బద్వేలు, పోరుమామిళ్ల, రాజంపేట, కోడూరు ప్రాంతాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం ఎన్నికల వేళలో అయినా... నాయకులు తమను అర్థం చేసుకుంటారని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు.ఐదేళ్లుగా సరైన వర్షాల్లేక బావులు, కుంటలు, చెరువులు ఎండిపోయాయి. బోరుబావుల కింద అరకొరగా సాగు చేసిన పంటలు ఎండిపోయాయి.
ఏటా వర్షాలను ఆధారంగా చేసుకుని లక్షన్నర ఎకరాల్లో పంటలు సాగు చేసేవారు. ఈసారి వరుణుడు మొహం చాటేశాడు. 20 ఏళ్లుగా పెంచుకున్న మామిడి తోటలు సైతం ఎండిపోయాయి. ప్రభుత్వం ఆదుకోకపోతే... గ్రామాలు వదిలి వెళ్లక తప్పదంటున్నారు అన్నదాతలు. ఎన్నికల వేళ... ఓట్ల కోసం వెళ్లే అభ్యర్థులకు ఈ కరవు సెగ తగలడం ఖాయంగా కనిపిస్తోంది.