ఈ నెల 23న జరిగే ఓట్ల లెక్కింపునకు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ కె.కృష్ణ తెలిపారు. కౌంటింగ్ రోజున ఎవరైన ఘర్షణలకు పాల్పడినా.. గొడవలకు దిగినా కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ హెచ్చరించారు. జమ్మలమడుగు డీఎస్పీ కార్యాలయం ఆవరణలో వివిధ పార్టీల కార్యకర్తలు, నాయకులతో ఆయన సమావేశమై.. 23న జమ్మలమడుగులో 144 సెక్షన్ అమలు ఉంటుందని స్పష్టం చేశారు. ర్యాలీలు, విజయోత్సవ కార్యక్రమాలు, బాణాసంచా కాల్చడం నిషేధమని తెలిపారు.
ఇవీ చూడండి : 'సాయంత్రం 4 గంటలకే కౌంటింగ్ పూర్తి చేస్తాం'