తాగడానికి నీరు లేక గోపాలపురం గ్రామస్థులు.. మండల కేంద్రమైన కమలాపురం గ్రామానికి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఇంట్లోని అవసరాలకు పొలాల వద్దకు వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు. పనులకు వెళ్లాల్సిన వాళ్లు.. నీటి కోసమే ఇంటి దగ్గరే ఉండాల్సి వస్తోంది. కమలాపురం నుంచి ఎర్రగుంట్ల వరకు ఉండే తాగునీటి పైప్లైన్ పగిలిపోవడంతో ఈ సమస్య వచ్చిందంటున్నారు. అధికారులు త్వరంగా మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: దేశంలో 4 కోట్లు దాటిన కరోనా పరీక్షలు