కడపజిల్లాలో నాడు - నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో జరుగుతున్న పనులపై జిల్లా జాయింట్ కలెక్టర్ సాయికాంత్ వర్మ ఆగ్రహం వ్యక్తంచేశారు. జులై 31 నాటికి నాడు- నేడు పనులు పూర్తి కావాల్సి ఉండగా.. చాలా పాఠశాలల్లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. 7 శాతం కంటే తక్కువ పనులు చేసిన పాఠశాలలకు మెమోలు జారీ చేయాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. జేసీ ఆదేశాల మేరకు డీఈవో శైలజ.. జిల్లాలోని 15 మంది ఎంఈవోలకు మెమోలు జారీ చేశారు. వీరితోపాటు 327 పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు మెమోలు జారీ చేశారు. 72 గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: పూర్తికాని పిడుగురాళ్ల బైపాస్ రహదారి నిర్మాణం