లాక్‌డౌన్ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉచిత రేషన్, కందిపప్పు పంపిణీని... పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు ప్రారంభించారు. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరుకులు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలు సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రతి 15 రోజులకు బియ్యం, కందిపప్పు ఉచితంగా ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలంతా లాక్‌డౌన్ పాటిస్తూ.. ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: