పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి వద్ద జాతీయ రహదారిపై అమలాపురం ఎంపీ చింతా అనురాధ కాన్వాయ్ వాహనం బోల్తా పడింది. ఆమె హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తుండగా ..తేతలి వద్ద జాతీయ రహదారిపై ఎంపీ కారును అనుసరిస్తున్న కాన్వాయ్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. వారికి తణుకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఎంపీ అనూరాధ ముందు కారులో వెళుతుండగా... ఆమె గన్‌మెన్, మరో ఇద్దరు వెనుక కారులో ఉన్నారు.
ఇవీ చదవండి...ధర్మవరంలో కొట్టుకున్న వైకాపా నేతలు