రాష్ట్రం చీకటి రాజ్యంగా మారిపోయిందని తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు. విద్యుత్ ఎప్పుడు పోతుందో.. ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో ఉందన్నారు. ఇది ప్రభుత్వ అసమర్థ విధానాలకు, దూరదృష్టి లేకపోవడానికి నిదర్శనమని వ్యాఖ్యనించారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సేవకులుగా నిర్ణయించిన వాళ్లు మొత్తం రెండు లక్షల 75 వేలు కాగా... నాలుగు లక్షలని వైకాపా నాయకులు చెబుతున్నారని విమర్శించారు. కమ్యూనిటీ హాల్స్‌కు వైకాపా పార్టీ రంగులు వేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని తెలిపారు. ఇసుకను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ...ప్రజలను అగచాట్ల పాలుచేస్తున్నారన్నారు.
ఇదీచదవండి