జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో విద్యార్థులకు జిల్లాస్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ క్రీడలను ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థుల్లోని క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు వివిధ పోటీలు నిర్వహిస్తున్నామని క్రీడా ప్రాధికార సంస్థ ముఖ్య కోచ్ దుర్గా ప్రసాద్ తెలిపారు. ఈ నెల 29 వరకూ ఈ పోటీలు జరుగుతాయని... అదేరోజు సాయంత్రం విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. క్రీడాకారులందరికీ భోజనం, వసతి సౌకర్యాలను కల్పించామని కోచ్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి-'గిరిజన ప్రాంతాల్లో వైద్య కళాశాల, ఆస్పత్రి ఏర్పాటు చేయాలి'