సర్వర్ల మొరాయింపుతో తణుకులో వివిధ రకాల సామాజిక పింఛన్ల పంపిణీలో అంతరాయం చోటు చేసుకుంది. లబ్ధిదారుల వేలిముద్రలు సర్వర్లు స్వీకరించకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయి. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా గడిచిన నాలుగు నెలలు లబ్ధిదారుల ఫొటోలతో వాలంటీర్ల వేలిముద్రలతో ట్యాగింగ్ చేసి పింఛన్లు పంపిణీ చేశారు. అయితే ఈ నెల నుంచి లబ్ధిదారుల వేలిముద్రలతో పంపిణీ చేయాలన్న ఆదేశాల మేరకు వాలంటీర్లు పంపిణీ ప్రారంభించారు. కానీ సాంకేతిక సమస్య వల్ల సర్వర్లు మొరాయించడంతో జిల్లాలో ఇబ్బందులు తలెత్తాయి.
ఇవీ చదవండి: భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం..